ఏదో ఒకరోజు రెహమాన్‌తో పనిచేస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Actress-Seerat-Kapoor
X

దిశ, సినిమా : పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సీరత్ కపూర్.. క్లాసికల్ సింగర్‌గా కూడా శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఏదో ఒకరోజు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. రణ్‌బీర్ కపూర్, నర్గీస్ ఫక్రీ జంటగా తెరకెక్కిన ‘రాక్‌స్టార్’ ప్రమోషన్స్ కోసం అసిస్టెంట్ కొరియోగ్రఫర్‌గా పనిచేశానన్న సీరత్.. ఆ సమయంలో రెహమాన్ జామ్ లైవ్‌ను చూసే అవకాశం దక్కడం అదృష్టమని పేర్కొంది.

ఆ పర్మార్ఫెన్స్ ఎండ్ అయ్యే వరకు కళ్లార్పకుండా చూశానని, ఆనందంతో ఏడ్చేశానని తెలిపింది. నిజంగా రెహమాన్ మ్యూజిక్ ఆత్మను స్పృశిస్తుందన్న సీరత్.. మొదటి లైన్ పాడగానే ఆయన సంగీత ప్రపంచంలోకి వెళ్లిపోయానని, ఫ్యూచర్‌లో తప్పకుండా తనతో కలిసి పనిచేస్తానని చెప్పింది. ఇక తెలుగులో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలో కనిపించిన ఈ హీరోయిన్.. డాన్స్, సింగింగ్ నేర్చుకోవడం వల్ల తనకు యాక్టింగ్ ఈజీ అయిందని వెల్లడించింది. 12 ఏళ్ల వయసు నుంచే ఇండియన్ క్లాసికల్, సెమీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story