- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ప్రాణం మీదకు వస్తే.. ఎవరినైనా చంపుతా : సినీనటి
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో తనపై వస్తోన్న అసభ్యకరమైన పోస్టులపై సినీ నటి, బీజేపీ లీడర్ మాధవీలతా స్పందించారు. సోషల్ మీడియా ట్రోల్స్‌పై శుక్రవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఓ వర్గం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని తెలిపారు. కొంతమంది తనను చంపుతానని బెదిరించినందుకే.. తాను గన్‌తో కాలుస్తానని అన్నట్టు స్పష్టం చేశారు. అంతేగాకుండా తన ప్రాణంమీదకు వస్తే.. ఎవరినైనా చంపడానికి వెనుకడను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడటం వల్ల కనీసం ఒక్క మహిళకు న్యాయం జరిగినా చాలు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా జీవితంలో విమర్శలు తీసుకుంటాం కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ముఖ్యంగా టీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు టార్గెట్ చేశారని వెల్లడించారు. తాను హిందూవుని అని దేవాలయాలపై దాడులు జరిగితే.. తాను చూస్తూ ఊరుకోనని అన్నారు. వైసీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. సమయం వచ్చినప్పుడు అందరి అంతు చూస్తానని తెలిపారు. రాజ్యాంగం మహిళలకు పూర్తి హక్కులు కల్పించిందని.. తాను ఏ విషయం మీదనైనా మాట్లాడటానికి అస్సలు వెనుకాడబోనని వెల్లడించారు. ఈ సమాజంలో అణగారిన, అణగదొక్కిన జాతి స్త్రీ జాతి అని.. ఆ సమాజ అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానని అన్నారు.