- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్శకురాలిగా మారిన హీరోయిన్ కళ్యాణి
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఇండస్ట్రీలో దర్శకురాళ్ల సంఖ్య చాలా తక్కువ. మహానటి సావిత్రి, విజయ నిర్మల, నందిని రెడ్డి, సుధా కొంగర, జీవిత రాజశేఖర్ … ఇలా వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అయితే వీరి వరుసలోనే చేరబోతోంది ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి. ‘శేషు’, ‘ఔను .. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘కబడ్డీ కబడ్డీ’, ‘పెదబాబు’, ‘వసంతం’ లాంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి… ఇప్పుడు మెగాఫోన్ చేతబట్టింది. చేతన్ శీను హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి తానే నిర్మాత కూడా. కె2కె ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు కళ్యాణి.
కాగా హోళీ పండుగను పురస్కరించుకుని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కళ్యాణికి బెస్ట్ విషెస్ చేప్తూ ట్వీట్ చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ్‌లో బైలింగ్వల్‌గా వస్తున్న ఈ మూవీలో సుహాసిని మణిరత్నం కీలక పాత్రలో కనిపించనున్నారట. యాత్ర, టాక్సీవాలా లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను కనిపించిన కళ్యాణి.. దర్శకురాలిగా రాణించాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రేక్షకులు.
Tags: Kalyani, Kaveri Kalyani, Director, Chetan Seenu, K2K Productions, Producer