- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కల్లో.. నవ్వుల్లో.. వివేక్ సజీవం!
దిశ, ఫీచర్స్ : నటనతో కోట్లాది ప్రేక్షకులను నవ్వించిన ఆ గుండె ఆగిపోయింది. రీల్‌లైఫ్‌లో తన పంచ్ టైమింగ్‌తో అలరించిన ఆ కామెడీ యాక్టర్, రియల్ లైఫ్‌లో మాత్రం ‘టైమ్’ లేదంటూ వెళ్లిపోయాడు. ఇన్నాళ్లుగా తను పంచిన వినోదాన్ని అభిమానులకు మిగిల్చిన ‘వివేక్’.. లక్షలాది మొక్కలను ఈ సమాజానికి బహుమానంగా ఇచ్చి సెలవంటూ వెళ్లిపోయాడు.
నటనతో మెప్పించిన వివేక్, పర్యావరణ ప్రేమికుడిగానూ మన్ననలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న తన స్నేహితుడు, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కోరికను దృష్టిలో పెట్టుకుని చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్‌గా చేపట్టాడు వివేక్. ఈ నేపథ్యంలోనే 2011లో కోట్లాది మొక్కలు నాటే లక్ష్యంతో ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించి, ఇప్పటివరకు దాదాపు 33.23 లక్షల మొక్కలు నాటాడు. ఇదేగాక తన కొడుకు పేర ‘సాయి ప్రసన్న ఫౌండేషన్’ ద్వారా ఒక కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన వివేక్.. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌లో ఒమాండురార్ ప్రభుత్వ ఎస్టేట్, తమిళనాడు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (టీఎన్‌జీఎంఎస్‌ఎస్‌హెచ్) ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాడు.
కేవలం చెట్ల పెంపకంతోనే సరిపెట్టుకోని వివేక్.. తన కుమారుడు డెంగ్యూ సమస్యతో మరణించిన తర్వాత డెంగ్యూ సహా పలు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సాయాన్ని అందించాడు. అయితే తను సంకల్పించిన ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండానే దురదృష్టవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే గ్రీన్ వారియర్‌గా ఆయన తలపెట్టిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత ఇకపై ఆయన అభిమానులదే కాదు.. పర్యావరణ ప్రేమికులది, శ్వాసించే మనుషులది కూడా.
మొక్కలు నాటడాన్ని ఉత్సవంలా జరిపాడు..
డాక్టర్ కలాం తన సినిమాల ద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయమని అడగడంతో వివేక్ ఒప్పుకున్నాడు. ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్ట్‌తో పాటు పలు కార్యక్రమాల ద్వారా సుమారు 50 లక్షల మొక్కలను నాటారు. ‘ఆలోచించండి, కలలు కనండి, ఆ ఆలోచనతో జీవించండి’ అనే వివేకానందుడి మాటల్ని ఈ వివేక్ తూచ తప్పకుండా పాటించాడు. అతను వృత్తిరిత్యా నటుడు కావచ్చు. కానీ వివేక్ ఓ గ్రీన్ వారియర్. పర్యావరణ రాయబారి. మొక్కలు నాటడాన్ని ఓ ఉత్సవంలా జరిపాడు, ఈ విషయంలో అతడు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాడు.
– డాక్టర్ కలాం శాస్త్రీయ సలహాదారు వి. పోన్రాజ్