- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సోనూ అస్‌లీ సోనా’.. విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ గిఫ్ట్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన దయా గుణాన్ని చాటుకున్నారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అయితే, స్మార్ట్ ఫొన్ లేని కారణంగా కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారనే విషయాన్ని జర్నలిస్టు ‘హీనా రోహ్‌తకి’ నటుడు సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది.
https://twitter.com/SonuSood/status/1298496211855400961?s=20
వెంటనే స్పందించిన సోనూ.. హర్యానా రాష్ట్రం మోర్ని జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల కోసమని స్మార్ట్‌ఫోన్‌లను అందించారు. సోనూ స్నేహితుడు అయిన కరణ్ గిల్హోత్రా ఈ స్మార్ట్‌ఫోన్‌లను విద్యార్థులు చదివే పాఠశాల ప్రిన్సిపాల్‌కు స్వయంగా అందజేశారు. అనంతరం విద్యార్థులు వీడియో కాల్ ద్వారా సోనూసూద్‌తో సంభాషించారు.
విద్యార్థులు ఇంట్లో చదువుకోవడానికి స్మార్ట్‌ఫోన్ రావడం చూసిన నటుడు తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అలాగే మారుమూల గ్రామంలోని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ చేరుకున్నందుకు కరణ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. సోనూ ట్వీట్‌లో.. ఇదొక ‘అద్భుతమైన ఆరంభం’ అని రాసుకొచ్చాడు. అంతే కాకుండా ‘పడేగి ఇండియా తబీ తో బడేగి ఇండియా’ అని కూడా ట్వీట్ చేశారు. విద్యార్థుల బాధలను తన దృష్టికి తీసుకొచ్చిన జర్నలిస్టుకు కూడా సోనూ ధన్యవాదాలు తెలిపాడు.