నేడు ఈడీ ముందుకు రకుల్

by Shyam |   ( Updated:2021-09-03 04:11:00.0  )
Tollywood Drug Case:
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మి విచారణ ముగిసింది. సుమారు 10 గంటల పాటు చార్మిని ఈడీ అధికారులు విచారించారు. చార్మి వాట్సాప్ చాట్, కాల్ డేటా, కెల్విన్‌తో లావాదేవీల‌పై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలుస్తొంది. అయితే విచార‌ణ‌లో చార్మి మాత్రం త‌నకు అస‌లు కెల్విన్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని ఈడీకి స‌మాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రానుంది. 6వ తేదీన విచారణకు రాలేనన్న విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ ఇవాళే విచారణకు రమ్మని కోరింది. ఉదయం పదిన్నరకు రకుల్‌ ఈడీ ముందుకు వచ్చే అవకాశముంది. డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ నోటీసులో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో రకుల్ పేరు లేకపోయినప్పటికీ.. డ్రగ్స్ విచారణ చేపట్టిన ఈడీ.. రకుల్ పేరును కూడా చేర్చింది. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈనెల 8న రానా దగ్గుబాటి, 9న రవితేజతో పాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది.

Advertisement

Next Story