- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించిన నవీన్ పొలిశెట్టి
దిశ, సినిమా: యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకుని స్టార్ అయిపోయాడు. పాండమిక్ టైమ్‌లోనూ యూట్యూబ్ వీడియోల ద్వారా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన హీరో.. ఇతరులకు సాయం చేయడంలోనూ ముందున్నాడు. కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారితో వీడియో కాల్స్ మాట్లాడుతూ ధైర్యం చెప్తూనే ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ టైమ్‌లో జాబ్ పోయిన సమీర్ అనే యువకుడికి ఉద్యోగం కావాలని, తను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
దీనిపై స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్.. సమీర్‌ను స్టోర్ మేనేజర్‌గా అపాయింట్ చేస్తూ కాల్ లెటర్ పంపించింది. ఈ ఆఫర్ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నవీన్.. సమీర్ ఇబ్బందుల గురించి తన దృష్టికి తీసుకొచ్చిన చరణ్, సౌమ్యలను అభినందించారు. త్వరలో ఈ స్టోర్‌కు వెళ్తానని.. పాండమిక్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తిరిగి జాబ్ వచ్చేలా హెల్ప్ చేద్దామని పిలుపునిచ్చాడు.