- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ కీచకులను వదిలే ప్రసక్తే లేదు’
దిశ, హుస్నాబాద్:
సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడికి సహకరిస్తున్న నలుగురు టీచర్లపై విచారణ జరపాలని బీజేపీ నేత బద్దిపడగ జైపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వెల్దండి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న జక్కుల శ్రీధర్ అనే సైన్స్ టీచర్.. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఓ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్లు పోస్ట్ చేయడంతో ఇటీవల సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సదరు టీచర్ విద్యార్థినికి పంపిన అసభ్యకర మేసేజ్లను మరో నలుగురు టీచర్లు జోక్యం చేసుకుని మెసేజ్లను డిలీట్ చేయడం ఏంటని బీజేపీ నేత జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్రమైన విచారణ జరిపించి కీచక ఉపాధ్యాయుడికి సహకరిస్తున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.