- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాల జిల్లా ప్రజలకు ఏసీపీ సాధన రష్మి కీలక సూచనలు
దిశ, మంచిర్యాల: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఏసీపీ సాధన రష్మీ పేరామాల్ కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోన్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల జనవరి 2వ తారీకు వరకు ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. అలాగే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు తప్పని సరిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సబ్ డివిజన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలతో తనీఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారికెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ నారాయణ నాయక్ పాల్గొన్నారు.