- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీపీ నరసింహారెడ్డి అరెస్టు : ఏసీబీ
దిశ వెబ్ డెస్క్:
మల్కాజ్ గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగాల మేరకు ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. ఈ మేరకు నాలుగు జిల్లాలో ఏక కాలంలో 25 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహించారు .కాగా ఆయనకు రూ. 75కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన స్వస్థలం అనంతపూర్‌లో 55 ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితో పాటు సైబర్ టవర్స్, మాదాపూర్‌ల వద్ద 4 ప్లాట్లు, హఫీజ్ పేట్ వద్ద జీ ప్లస్ 3 ఉన్నట్టు గుర్తించింది. ఇక ఆయన వద్ద 15లక్షల నగదు,రెండు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు కొన్ని కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన సమయంలో పలు ల్యాండ్ సెటిల్ మెంట్లలో ఆయన తలదూర్చినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.