కోడెల విగ్రహావిష్కరణకు అచ్చెన్నాయుడు, దేవినేని దూరం

by srinivas |
KOdela Shivaprasad
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ముసలం నెలకొంది. సత్తెనపల్లిలో అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ విషయంలో వివాదం నెలకొంది. గురువారం కండ్లకుంటలో కోడెల విగ్రహావిష్కరణకు ఆయన తనయుడు కోడెల శివరాం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు హాజరవుతారంటూ కోడెల శివరాం ఇప్పటికే ఆహ్వాన పత్రికలను సైతం పంపిణీ చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శివరాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ కార్యక్రమానికి హాజరుకావద్దంటూ టీడీపీ నేతలకు స్థానిక నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో విగ్రహావిష్కరణకు వెళ్లకూడదని అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా హాజరుకాకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో పార్టీ వివాదం పరిష్కారం అయ్యేలా దృష్టి పెడతానని అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed