- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు సవాల్.. వారిపై కేసు పెట్టే ధైర్యం ఉందా? : అచ్చెన్న
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. పోలీసుల తీరుపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన నిరసన తెలిపితే, కొవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మహానేత వర్థంతి సభలకు, వైసీపీ నేతల పాదయాత్రలకు, రికార్డింగ్ డ్యాన్సులకు కొవిడ్ నిబంధనలు వర్తించవా? కేవలం టీడీపీ నేతల నిరసనలకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. పోలీసులతో ప్రతిపక్ష నేతలను జగన్‌రెడ్డి భయపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతల చిట్టా తమ వద్ద ఉందని, వారిపై సుమోటోగా కేసు నమోదు చేసే ధైర్యం ఈ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఉందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.