- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ ‘ఆచార్య’.. పాఠాలు కాదు గుణపాఠాలు చెప్తాడు!
దిశ, వెబ్‌డెస్క్: మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్‌లో కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ కాగా, సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు ఫ్యాన్స్. ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’ అనే చరణ్ వాయిస్‌తో స్టార్ట్ అయిన టీజర్‌లో చిరును ఊరమాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో చూపించారు కొరటాల.
టీజర్‌ను పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో నిండిపోగా.. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా… అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అన్న చిరు డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి చరణ్ టీజర్‌లో కనిపించకపోయినా వాయిస్‌తోనే గూస్ బంప్స్ తెప్పించాడంటున్న ఫ్యాన్స్.. 65 ఏళ్లలో కూడా చిరు అదే స్టైల్, అదే జోరుతో థియేటర్లు దద్దరిల్లడం.. బాక్సాఫీస్ రికార్డ్‌లు కొల్లగొట్టడం పక్కా అంటున్నారు. సమ్మర్ కొంచెం తొందరగా రావా? అని కోరుతున్నారు ఫ్యాన్స్. చిరు, కొరటాల, మణిశర్మ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని చెప్తున్నారు. మొత్తానికి టీజర్‌ను టెంపుల్ సెట్‌లో షూట్ చేసిన సీన్స్‌తోనే డిజైన్ చేయగా.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక టీజర్ రిలీజ్ అయిన ఐదు నిమిషాల్లోనే వన్ మిలియన్ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతున్న ‘ఆచార్య’ టీజర్.. యూట్యూబ్‌లో మెగా హంట్ మొదలెట్టేసింది.