- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథ, కాన్సెప్ట్ కొరటాలదే!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించబోతున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా కాగా.. కథ మాత్రం తనదేనని ఆరోపించారు రచయిత కన్నెగంటి అనిల్ కృష్ణ. మోషన్ పోస్టర్‌లో వచ్చే సన్నివేశం నేను రాసుకున్నదే అని, 2006లో పుణ్యభూమి పేరుతో స్టోరీ రిజిస్టర్ చేయించానని చెప్పాడు. కాగా ఈ ఆరోపణలపై క్లారిటీనిచ్చింది మూవీ యూనిట్.
ఆచార్య కథ, కాన్సెప్ట్ కేవలం డైరెక్టర్ కొరటాల శివకు చెందినది మాత్రమే అని స్పష్టం చేస్తూ నోట్ రిలీజ్ చేసింది. దీని గురించి వచ్చిన ఆరోపణలన్నీ కూడా బేస్ లెస్ అని చెప్పారు. మెగాస్టార్ చిరు పుట్టినరోజున రిలీజైన మోషన్ పోస్టర్.. సమాజంలోని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిందని, సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిందన్నారు. ఈ సమయంలో కొందరు రచయితలు ‘కథ మాదే’ అంటూ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కానీ ఆచార్య కథను చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచామని.. చాలా కొద్ది మందికి మాత్రమే కథ తెలుసన్నారు. ‘మోషన్ పోస్టర్‌లో ఉన్న ఒక్క సన్నివేశాన్ని చూసి కథ నాదే’ అని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ఆచార్య కథ ఒరిజినల్ అని స్పష్టం చేసిన టీమ్.. ఫిల్మ్ మేకర్ కొరటాల శివ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానికి ఆరోపణలు చేసిన వారు కూడా కనిపించలేదని.. ఇది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టిపారేశారు.
కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని.. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.