- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లాడిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు.. మల ద్వారంలోకి రాళ్లు దూర్చి మరీ..!
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మం. కొండపల్లి మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లాడిపై ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. వివరాల్లోకి వెళ్తే కొండపల్లి మున్సిపాలిటీ శాంతి నగరంలో ఒక చిన్న పిల్లవాడు ఆటలాడుకుంటుండగా ఓ వ్యక్తి అతడి నోరు మూసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం అతడిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మలద్వారంలో రాడ్లు దూర్చి రాక్షసానందం పొందాడు. కామాంధుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు ఇంటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయాడు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడిని పరిశీలించగా అఘాయిత్యం జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా రాత్రంతా పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉంచి తెల్లవారు జామున గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుపై దేవినేని ఉమా ఆగ్రహం
చిన్నపిల్లాడిపై అఘాయిత్యం జరిగినప్పుడు పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘాయిత్యం జరిగి బాలుడు విలపిస్తుంటే ఆస్పత్రికి తరలించకుండా పోలీస్ కంట్రోల్ రూమ్‌లోనే ఉంచుకోవడం దుర్మార్గమన్నారు. తెల్లవారు జామున 5 గంటలకు పిల్లవాడ్ని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లడంపై మండిపడ్డారు. చిన్న పిల్లలపై ఇటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నాయని కానీ పోలీసులు ఆ విధంగా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కానీ, పత్రికా విలేకరులకు కాని ఎవరికి తెలియకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
ఈ ప్రభుత్వం మీడియా గొంతును అణిచివేస్తోందని ధ్వజమెత్తారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల మీద, చిన్న పిల్లల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున పట్టపగలు బీటెక్ విద్యార్థిని రమ్యను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌పైనా మాజీమంత్రులపైనా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకి ఈ నేరప్రవృత్తి పెరిగిపోయిందని ఇది సమాజానికి మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలని దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.