- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హంతకుడిని పట్టించిన కాలి మెట్టెలు.. విచారణలో షాకింగ్ నిజాలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఐదు రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసు వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. ‘ఈ నెల 5న మాక్లూర్ మండలం ముల్లంగి శివారులో మహిళ హత్య, దహనం ఘటన సమాచారంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. హంతకులు మహిళను పూర్తిగా దహనం చేసినా.. ఆమె కాలి మెట్టెలు మాత్రం మిగిలిపోవడంతో మృతి చెందిన మహిళ బొంకన్ పల్లికి చెందిన రాణి(35)గా గుర్తించాం. ఈ కేసును మృతురాలి కూతురు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో ఛేదించాం’.
హత్యకు కారణాలు..
నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో రాణి స్వీపర్‌గా పని చేస్తోంది. రాణికి బొంకన్‌పల్లికి చెందిన గణేష్‌తో రెండవ వివాహం జరిగింది. భార్యాభర్తల నడుమ ఇటీవల నిత్యం గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే రాణిని పికప్ చేసుకునేందుకు ఆసుపత్రి వద్దకు ఆటోలో వచ్చిన గణేష్ హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. మార్గమధ్యలో గొడవపడి చీరతో గొంతుకు ఉరి వేసి హత్య చేసి, అనంతరం ఆటోలోని డీజిల్‌తో దహనం చేసినట్టు ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. శనివారం గణేష్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేసిన తర్వాత రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన నార్త్ సీఐ, మాక్లూర్ ఎస్సై, ప్రొబేషనరి ఎస్సైతో పాటు సిబ్బందిని ఏసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు.