‘సలార్‌’ షూటింగ్‌లో యాక్సిడెంట్.. టార్గెట్ చేశారా..?

by Anukaran |   ( Updated:2021-02-02 13:00:58.0  )
‘సలార్‌’ షూటింగ్‌లో యాక్సిడెంట్.. టార్గెట్ చేశారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్‌ షూటింగ్‌ గోదావరిఖని బొగ్గు గనుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా గోదావరిఖనిలోని శ్రీనగర్‌ వద్ద యూటర్న్ చేస్తుండగా.. సలార్ మూవీ యూనిట్ వ్యాన్‌ను లారీ ఢీ కొట్టిందని సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ప్రమాదంలో పలువురు చిత్ర సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ముంబై‌లోని ఆదిపురుష్ సినిమా తొలి షూటింగ్‌ సెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మరువక ముందే.. సలార్ షూటింగ్‌లో కూడా ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్‌లో మంటలు.. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది.. తేడా కొడుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఈ రెండు సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story