- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా
దిశ ప్రతినిధి, వరంగల్: అక్రమ వెంచర్లకు పర్మీషన్ ఇస్తూ జేబులు నింపుకుంటున్న అవినీతి అధికారులకు ఏసీబీ ఆఫీసర్లు చెక్ పెడుతున్నారు. కాంట్రాక్టర్లు, రియల్ వ్యాపారుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇటీవల జనగామ డీఈ రవీందర్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ చిక్కడంతో.. ఆయన అక్రమాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి.
అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝలిపిస్తోంది. అక్రమ సంపాదన కోసం అమాయకులను పట్టిపీడిస్తున్న ప్రభుత్వ అధికారులను ఏసీబీ ఆఫీసర్లు చాకచక్యంగా పట్టుకుంటున్నారు. దీంతో దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లుగా వ్యవహరిస్తున్న లంచగొండి అధికారుల్లో వణుకు మొదలైంది. జనగామ జిల్లా డీఈ రవీందర్ రెడ్డి శనివారం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
అక్రమ వెంచర్లకు అనుమతులు
జనగామ జిల్లా ఆవిర్భావం తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో జిల్లా కేంద్రానికి సమీప గ్రామాల్లో పలు వ్యవసాయ క్షేత్రాలు వెంచర్లుగా మారాయి. అంతేకాకుండా పలు చెరువులు, కుంటలు కూడా ఆక్రమించిన రియల్టర్లు ఇరిగేషన్ సంబంధిత అధికారులను మేనేజ్ చేసి వెంచర్లుగా మార్చారు. శనివారం ఏసీబీకి పట్టుబడిన డీఈ రవీందర్ రెడ్డి నామ మాత్రంగా తనిఖీలు చేసి రియల్టర్ల వద్ద లక్షల రూపాయలు తీసుకుని వెంచర్లకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
కుమ్మరికుంట పూడ్చివేత
జనగామ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న శామీర్ పేట సమీపంలోని కుమ్మరి కుంటను రియల్టర్లు పూడ్చేసి వెంచర్ చేశారు. ఈ విషయం తెలిసినప్పటికీ వారి వద్ద నుంచి లక్షల రూపాయల ముడుపుల రూపంలో తీసుకుని అనుమతి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. అధికారి సహకారంతో వెంచర్‌లో ప్లాట్లను అమ్ముకుని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు అమాయకులు ఇళ్లు నిర్మించుకునేందుకు పర్మీషన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే కొంతమంది అక్కడ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించగా మున్సిపల్ అధికారులు అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి.
చొప్పని చెరువు ఆక్రమణ
అదే విధంగా లింగాల ఘనపురం పటేల్ గూడెం సమీపంలోని చొప్పని చెరువును పూర్తిగా ఆక్రమించిన రియల్టర్లు వెంచర్‌గా మార్చేశారు. సుమారు 27 ఎకరాల్లో ఉన్న చెరువును పూడ్చిన అక్రమార్కులు సగానికి పైగా ప్లాట్లు వేసి అమ్మేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు వెంచర్ సగానికిపైగా మునగడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వెంచర్‌కు సైతం నిబంధనలకు విరుద్ధంగా నీటి పారుదలశాఖ అధికారులు లంచం తీసుకుని అనుమతులిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమార్కుల్లో వణుకు..
రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు కొనసాతున్నప్పటికీ అవినితీ అధికారుల పనితీరు మారని వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో సైతం కాంట్రాక్టర్‌కు పైసలు ఇప్పించే పనిలో ఇరిగేషన్ అధికారి డీఈ రవీందర్ రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడడంతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది. గత సంవత్సరంలో పలువురు అధికారులతో కలసి రంగప్ప చెరువు శిఖం భూముల్లో ఆక్రమణల పేరుతో కొంత మందికి నోటీసులు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్ల కాలంలో నలుగురు అధికారులను వరంగల్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు జనగామ అగ్నిమాపకశాఖ అధికారిగా , జిల్లా ఎస్సీ డెవలప్ మెంట్ అధికారి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, పాలకుర్తికి చెందిన ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.