మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు..!

by Anukaran |   ( Updated:2020-09-23 01:52:06.0  )
మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు..!
X

దిశ, వెబ్‎డెస్క్: మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నట్లు ఆరోపణలో భాగంగా తనిఖీలు చేపట్టారు. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశారు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో నరసింహారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యలు ఇళ్లలో ఏకకాలంలో 12 చోట్లసోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‎లో 4చోట్ల, కరీంగనర్‎లో 2చోట్ల, నల్లగొండలో 2చోట్ల, అనంతపూర్‎లో ఒకచోట సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story