ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎసీబీ తనిఖీలు

by Aamani |
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎసీబీ తనిఖీలు
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో గురువారం సాయంత్రం ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు జూనియర్ డాక్టర్ల వేతనాల చెల్లింపు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖకు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 7గంటల నుంచి రికార్డుల తనిఖీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.వేతనాల చెల్లింపుల విషయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ తెలిపింది. రైడ్స్ జరుగుతున్న సమయంలో మీడియాతో పాటు ఇతరులను ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఇదిలాఉండగా, వేతనాల చెల్లింపులకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.కాగా, ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story