కీసర తహసీల్దార్‌ను కస్టడీ కోరిన ఏసీబీ

by Sumithra |
కీసర తహసీల్దార్‌ను కస్టడీ కోరిన ఏసీబీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: కీసర తహసీల్దార్ నాగరాజును విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. తహసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నాగరాజు కారులో రూ.8 లక్షలు, ఇంట్లో రూ.28 లక్షలతో పాటు ఓ బ్యాంకు అకౌంట్‌లో మరో రూ.11 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నాగరాజు నుంచి మరిన్ని విషయాలను రాబట్టేందుకు ఏసీబీ కస్టడీ కోరింది. విచారణలో ఎంపీ లెటర్ హెడ్‌లకు సంబంధించి, ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై నాగరాజును ఏసీబీ ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed