ఏసీబీ వలలో మరో ‘లంచా’ధికారి..

by srinivas |   ( Updated:2020-02-19 12:50:04.0  )
ఏసీబీ వలలో మరో ‘లంచా’ధికారి..
X

ఏపీ టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచాలు తీసుకోవడంలో అధికారులు రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా ఏసీబీ దాడులు జరుగుతున్నా కొంచెం కూడా భయంలేకుండా అధికారులు వ్యవహారిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ అనంతపురం టౌన్ ప్లానింగ్ సర్వేయర్ కోటేశ్వర రావు పట్టుబడ్డాడు. అతను తీసుకున్నఅవినీతి సొమ్ము అక్షరాల రూ.7లక్షలు. విశ్వసనీయ సమాచారం మేరకు కోటేశ్వర రావును పట్టకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story