నిన్ను తప్పించాలంటే.. యువకుడికి కొత్తవలస ఎస్సై బంపర్ ఆఫర్.. చివరకు!

by srinivas |   ( Updated:2021-08-04 05:07:02.0  )
acb-case-ap
X

దిశ, వెబ్‌డెస్క్ : బాధ్యతాయుతమైన సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉండి నిందితులకు సహాయం చేసేందుకు సిద్ధపడటమే కాకుండా లంచం డిమాండ్ చేశాడు ఓ అధికారి. ఈ విషయం తెలియడంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలసలో బుధవారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. మహిళను వేధింపులకు గురిచేసిన ఓ యువకుడిని కేసు నుంచి తప్పించాలంటే రూ.50 వేలు ఇవ్వాలని కొత్త వలస ఎస్సై నరసింహమూర్తి డిమాండ్ చేశారు. అంతడబ్బు తన వద్ద లేదని ఆ యువకుడు అధికారికి చెప్పగా.. డబ్బులు ఇస్తేనే సురక్షితంగా వెళ్లొచ్చని లేనియెడల శిక్ష తీవ్రతరం అవుతుందని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక బాధిత యువకుడు ఏసీబీని ఆశ్రయించాడు. చివరకు ఎస్సైకు యాభై వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆ అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story