బయటపడ్డ ఎస్‌ఐ భాగోతం.. రెడ్ హ్యాండెండ్‌గా వారికి దొరికిపోయాడు

by Shyam |   ( Updated:2021-07-06 06:18:46.0  )
బయటపడ్డ ఎస్‌ఐ భాగోతం.. రెడ్ హ్యాండెండ్‌గా వారికి దొరికిపోయాడు
X

దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ కేసుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా పోలీస్ స్టేషన్‌లోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది బయటకు వెళ్ళకుండా, మిగతా వాళ్లు లోపలికి రాకుండా కట్టడి చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా అధికారులు, సిబ్బంది లోపలికి రాకుండా కట్టడి చేసి సోదాలు చేపట్టారు అవినీతి శాఖ అధికారులు.

Advertisement

Next Story