సైన్స్ గ్రూప్‌ తొలగించవద్దు అంటూ ABVP ధర్నా

by Sridhar Babu |
సైన్స్ గ్రూప్‌ తొలగించవద్దు అంటూ ABVP ధర్నా
X

దిశ, మంథని: మంథని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ‌లో సైన్స్ గ్రూప్‌ని తీసి వేస్తే సహించేది లేదని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం విద్యార్థులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీని మల్లెపల్లి నుండి మంథని పట్టణంలో పాత జూనియర్ కళాశాలలోకి మార్చాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, జడ్పీ చైర్మన్ ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజు, ఎడ్ల సదాశివ్, పోతారవేణి క్రాంతికుమార్, బూడిద రాజు, వేల్పుల సత్యం, పబ్బ తిరుపతి, రౌతు సంతోష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story