అత్యాచారం నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి

by Shyam |
అత్యాచారం నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: గిరిజన యువతిపై 9ఏళ్లుగా అత్యాచారం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్డడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ ఓ యువతిని 9 ఏళ్లుగా బలవంతంగా శారీరకంగా, మానసికంగా అత్యాచారం చేయడం సిగ్గు చేటన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తెర వెనుక ఉన్న కీచకులందర్నీ వెంటనే అరెస్టు చేసి, 139మందిని చేయాలన్నారు. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేందుకు కేసును సీఐడీకి అప్పగించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు ప్రవీణ్, సుమన్, శ్రీకాంత్, విజయ్, రాజశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story