- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాలిన్ సంచలన నిర్ణయం.. తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కఠిన ఆంక్షలు విధించినా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 24 వరకూ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. నిత్యావసరాలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. మద్యం షాపులు, ప్రైవేట్ కంపెనీలు మూసివేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్ తెలిపారు.
Advertisement
Next Story