- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టాలెంట్ పవర్‌హౌస్.. ‘సన్యా మల్హోత్ర’
దిశ, ఫీచర్స్: వెండితెరపై తమ నటనతో మెస్మరైజ్ చేసే నటులు కొంతమందే ఉంటారు. వాళ్లు పోషించే క్యారెక్టర్స్ మాత్రమే మనకు గుర్తుండిపోయేలా, వాటిలో జీవిస్తారు. పాత్ర నిడివిని పట్టించుకోకుండా, క్యారెక్టర్ ఇంటెన్స్, ఇంపార్ట్‌టెన్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుడిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు. అందుకే ఆయా నటులు ఎంచుకునే కథలు, క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వెర్సటైల్ రోల్స్‌తో, జీనియస్ పర్‌ఫర్మెన్స్‌తో బాలీవుడ్ నటి ‘సన్యా మల్హోత్ర’ సత్తా చాటుతోంది. ఇటీవల కాలంలో సన్య చేసిన క్యారెక్టర్స్ ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుండగా, ఈ టాలెంట్ పవర్ హౌస్ యాక్టింగ్ జర్నీ విశేషాలు మీకోసం..
సన్య లీడ్‌రోల్ పోషించిన ‘పగ్లెయిట్’ అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలైంది. సమాజంలోని పాత, సంప్రదాయ పద్ధతులపై ఈ చిత్రం ఓ కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. పెళ్లయిన 5 నెలలకే భర్తను కోల్పోయిన సంధ్య పాత్రలో సన్య నటించగా, ఉమ్మడి కుటుంబంలో ఆమె జీవిస్తూ ఉంటుంది. అత్తింట్లోని పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను చూపిస్తూనే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే విషయాన్ని చెప్పాడు డైరెక్టర్. ఆచార సంప్రదాయాల్లోని డొల్లతనాన్ని చర్చిస్తూనే, అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో, ఇండిపెండెంట్‌గా ఉండాలని, నిర్ణయాధికారాన్ని తీసుకునే శక్తి మహిళలకు ఉండాలని చూపించాడు. సంధ్య పాత్ర సగటు మహిళ కథకు ప్రతిబింబంగా నిలుస్తుంది. సన్యా మల్హోత్ర మరోసారి తన నటనతో ‘సంధ్య’ పాత్రకు ప్రాణం పోసింది.
సన్య బాలీవుడ్‌లోకి ప్రవేశించి ఎంతో కాలం కాలేదు. కానీ ఆమె సినిమా సినిమాకు వేరియేషన్ ఉన్న రోల్స్ సెలక్షన్స్ చేసుకుంటూ ఆమెలోని ఆర్టిస్ట్‌ను ఆవిష్కరించుకుంటోంది. గతేడాది ‘లూడో, శకుంతల దేవి’ అనే రెండు సినిమాల్లో ఆమె నటించి నటిగా నిరూపించుకుంది. ‘లూడో’లో శ్రుతిగా ఆమె చేసిన బోల్డ్ అవతార్‌కు ప్రశంసల వర్షం కురిసింది. ఆదిత్య రాయ్ కపూర్‌తో ఆమె సిజ్లింగ్ కెమిస్ట్రీని కూడా అంతా తేలిగ్గా మరిచిపోలేం. ఇక శకుంతల దేవి కుమార్తె అనుపమ బెనర్జీ పాత్రతో ఆమె ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరిచింది. సవాలు చేసే పాత్రలకు ఆమె కేరాఫ్‌గా మారింది. ఇక తొలి చిత్రం ‘దంగల్’లో ప్రఖ్యాత రెజ్లర్ బబితా కుమారి పాత్రను పోషించి, అరంగేట్రంలోనే విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఇక ‘పటాఖా’లో యంగ్, వైబ్రంట్ చుట్కీ కుమారీగా సన్య చేసిన యాక్టింగ్ రియల్లీ స్పెల్ బౌండింగ్. ‘ఫొటోగ్రాఫ్’ చిత్రంలో వెటరన్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీకి దీటుగా నటించి అక్కడ మంచి మార్కులు కొట్టేసింది. ఆమె చేసిన తక్కువ సినిమాలతోనే బహుముఖ ప్రజ్ఞను చాటింది. డ్యాన్స్‌లోనూ సన్య ది బెస్ట్ అని నిరూపించుకుంది. సరదా పాత్రలు పోషించడం నుంచి సంధ్య వంటి సంక్లిష్ట పాత్రల వరకు, సన్య యాక్టింగ్ జర్నీ అద్భుతంగా సాగింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన సన్య, బ్యాలె డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. డిగ్రీ మాత్రమే చదివిన సన్య, ముంబైలో అవకాశాల కోసం తిరిగే సయమంలో టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం కెమెరాపెర్సన్‌లకు సహయకురాలిగా చేసింది. ‘నేను ప్రతీ క్యారెక్టర్ ప్రయత్నించాలనుకుంటున్నాను. నటన కోసం నేను ప్రత్యేకంగా శిక్షణ పొందలేను, అందుకే నేను అన్ని రకాల పాత్రలు చేస్తూ నేర్చుకుంటాను’ అని చెప్పుకొచ్చింది సన్యా మల్హోత్ర.