- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటితో ముగియనున్న ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం
దిశ, తెలంగాణ బ్యూరో: శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం నేటితో ముగియనుంది. గవర్నర్ కోటాలో ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరి పదవీకాలం ఈనెల 16తో ముగుస్తుంది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. ఈ జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, గవర్నర్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదే విధంగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవికాలంలో వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. వీరు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. వీరిలో కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్ రెడ్డి, భాను ప్రసాద్, పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్ రావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఉన్నారు.
ఆశావహుల ఎదురుచూపు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడిన ఎంసీ కోటిరెడ్డికి మంచి పదవి ఇస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, వరంగల్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, గుడిమల్ల రవికుమార్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు గాక మరికొంత మంది తెరమీదకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పదవికాలం ముగిసిన వారిని కొనసాగిస్తారా? లేక కొందరికి అవకాశం ఇచ్చి.. మిగతావారి స్ధానంలో కొత్తవారిని నియమిస్తారా? అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.