అభిషేక్‌ను మోటివేట్ చేస్తున్న షారుఖ్

by Anukaran |   ( Updated:2020-08-08 03:31:11.0  )
అభిషేక్‌ను మోటివేట్ చేస్తున్న షారుఖ్
X

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. తండ్రి అమితాబ్ బచ్చన్, సతీమణి ఐశ్వర్యా రాయ్, కూతురు ఆరాధ్య కరోనా నుంచి త్వరగానే కోలుకున్నా.. తను మాత్రం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్‌లో జాయిన్ అయి శనివారానికి 29 రోజులు కాగా.. ఆస్పత్రి నుంచి ఒక ఫొటోను షేర్ చేశాడు జూనియర్ బచ్చన్.

‘సాధారణంగా కరోనా పేషెంట్స్ చాలా డిప్రెషన్‌కు లోనవుతారు.. ఏమైపోతామనే భయంతో వణికిపోతూ ఉంటారు. అలాంటి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు.. భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగేందుకు షారుఖ్ ఖాన్ పాట వింటున్నా’ అని తెలిపాడు అభిషేక్. 2004లో వచ్చిన స్వదేశ్ సినిమాలోని ‘యూ హి చలా చల్ రహి’ పాట వింటూ స్ఫూర్తి పొందుతున్నట్లు చెప్పాడు.

కాగా జూలై 27న కరోనా నెగెటివ్ రావడంతో ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ కాగా.. ఆగస్ట్ 2న అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.

Advertisement

Next Story