13ఏళ్ల తర్వాత జిగ్రీ దోస్త్‌తో కలిసి నటిస్తున్న అభిషేక్

by Jakkula Samataha |
13ఏళ్ల తర్వాత జిగ్రీ దోస్త్‌తో కలిసి నటిస్తున్న అభిషేక్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తనను గతంలో విమర్శించిన వారికి లేటెస్ట్ సినిమాలు, సిరీస్‌లతో గట్టి సమాధానమే చెప్పాడు. మల్టీ డిజార్డర్‌ పర్సనాలిటీతో బాధపడుతున్న వ్యక్తిగా ‘బ్రీత్’ సీజన్ 2 ద్వారా యాక్టర్‌గా సూపర్బ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న అభిషేక్.. ‘బ్రీత్ సీజన్ 3’ కూడా కన్‌ఫర్మ్ చేసేశాడు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫిబ్రవరిలో ఆగ్రాలో ‘దస్వీ’ షూటింగ్‌ స్టార్ట్ చేశామని, ఏప్రిల్ చివరి వారంలో పూర్తవుతుందని తెలిపాడు.

ఇది ఫినిష్ కాగానే ఇమ్మిడియేట్‌గా బ్రీత్ షూటింగ్‌లో జాయిన్ అవుతానని చెప్పాడు. ఆ తర్వాత జాన్ అబ్రహంతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామని, దాదాపు 13 ఏళ్ల తర్వాత తన జిగ్రీ దోస్త్‌తో వర్క్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు అభిషేక్.

Advertisement

Next Story