అబ్దుల్ కలామ్ సోదరుడు కన్నుమూత

by Shamantha N |   ( Updated:2021-03-07 11:43:40.0  )
అబ్దుల్ కలామ్ సోదరుడు కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సోదరుడు ఏపీజే మహ్మద్ ముతు మీర మరైకయర్(104) తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఈరోజు సాయంత్రం 7.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. మరైకయర్ గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అబ్దుల్ కలాం సోదరుడి మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరైకయర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story