రిటైర్మెంట్ వెనక్కి.. క్లారిటీ ఇచ్చిన మిస్టర్ 360

by Shiva |
రిటైర్మెంట్ వెనక్కి.. క్లారిటీ ఇచ్చిన మిస్టర్ 360
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఏబీ రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటాడని, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడతాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై గతంలో స్పందించిన ఏబీడీ.. ఐపీఎల్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపాడు.

ఈ క్రమంలో తాజాగా రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమే లేదని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదంటూ పేర్కొన్నాడు. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, ఏబీడీ అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.

Advertisement

Next Story