నా సస్పెన్షన్ చెల్లదు: క్యాట్‌ను ఆశ్రయించిన వెంకటేశ్వరరావు

by srinivas |
నా సస్పెన్షన్ చెల్లదు: క్యాట్‌ను ఆశ్రయించిన వెంకటేశ్వరరావు
X

రహస్యాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటుకు గురైన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. నిరాధారమైన ఆరోపణలతో, రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఆరోపిస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేసిన ఆయన, ఆ ఉత్తర్వులను కొట్టేయాలని అందులో కోరారు. గత ఏడాది మే నుంచి ఏపీ ప్రభుత్వం తనకు వేతనం కూడా చెల్లించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story