- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్మికులు తలకిందులుగా నిరసన
దిశ, సంగారెడ్డి: కంది మండలంలోని ఆశా కో పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సోమవారం యాజమాన్యం వైఖరికి నిరసగా కార్మికులు తలకిందులుగా నిలబడి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జి.సాయిలు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
మూడు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరినీ యథావిధిగా డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే దాకా పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కృష్ణ, నాగరాజు, నిజాముద్దీన్, బాబురావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లన్న, మార్కండేయ, శశి భూషణ్ రెడ్డి, వెంకటేష్ తో పాటు కార్మికులు పాల్గొన్నారు.