విశ్వనాథన్ ఆనంద్‌తో బాలీవుడ్ గేమ్స్

by Anukaran |   ( Updated:2021-06-09 08:21:05.0  )
విశ్వనాథన్ ఆనంద్‌తో బాలీవుడ్ గేమ్స్
X

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది చెస్ కమ్ ఇండియా. ఈ క్రమంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనందన్‌తో బాలీవుడ్ స్టార్స్‌ చెస్‌లో పోటీపడేందుకు ప్లాన్ చేసింది. జూన్ 13న ఈ గేమ్ జరగనుండగా.. ఈ లిస్ట్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, సింగర్ ఆర్జిత్ సింగ్‌ ఉన్నారు. చెస్‌కమ్ ఇండియా యూట్యూబ్‌ చానల్‌లో ప్రసారం కానున్న ఈ వర్చువల్ గేమ్ ద్వారా ఫండ్స్ రేజ్ చేయనున్నారు. ఈ నిధులతో కొవిడ్ బాధితులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వనున్న ఆర్గనైజర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒకరికి ఒకరు సహాయంగా ఉందామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story