ఇక్కడ చిరు.. అక్కడ అమీర్

by Shyam |   ( Updated:2020-11-28 04:52:32.0  )
ఇక్కడ చిరు.. అక్కడ అమీర్
X

దిశ, వెబ్‌డెస్క్ : జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను అత్యద్భుతంగా చెక్కుతారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఫిల్మింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నా గానీ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం లెక్క తక్కువ కాకుండానే చూస్తుంటాడు. ప్రేక్షకులు కోరుకున్న దానికి మించి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నయినా అస్సలు వదులుకోడు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవిని ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇచ్చేలా చేసిన జక్కన్న… తనతో తారక్, చరణ్‌ ఎంట్రీ, పాత్రల పరిచయం గురించిన వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు. దీని మీద ఎలాంటి అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్ రాకపోయినా ఇది ఫైనల్ అయిందనేది వాస్తవం.

మరి హిందీలో ప్రాజెక్ట్ హైప్ చేయాలంటే ఎవరిని సెలక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న జక్కన్న.. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను ఎంచుకున్నారని సమాచారం. హిందీ వర్షన్‌లో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ వినిపించనుండగా.. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఏ శకంలో కథ సాగుతుంది అనేది వివరించనున్నారని టాక్. సినిమాలో మాత్రమే కాదు ట్రైలర్‌లోనూ అమీర్ తన వాయిస్ వినిపించనున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story