సెక్స్, ప్రెగ్నెన్సీ.. తండ్రితో అలా చేస్తావా.. సిగ్గు అనిపించట్లేదా?

by Shyam |   ( Updated:2021-07-25 03:28:03.0  )
సెక్స్, ప్రెగ్నెన్సీ.. తండ్రితో అలా చేస్తావా.. సిగ్గు అనిపించట్లేదా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్‌పై నెటిజన్లు ఫైర్ అయినట్లు తెలిపింది. తన యూట్యూబ్ చానల్‌లో తండ్రితో కలిసి సెక్స్, ప్రెగ్నెన్సీ, డ్రగ్స్ గురించి డిస్కస్ చేస్తూ చేసిన ఇంటర్వ్యూపై బ్యాడ్ కామెంట్స్ ఎదురైనట్లు తెలిపింది. ‘తండ్రితో సెక్స్, ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడేందుకు సిగ్గులేదా?’ అని తిట్టారని తెలిపింది. కానీ అదే సమయంలో ఇలాంటి ప్రోగ్రెసివ్ పేరెంట్‌ను చూడటం ఆనందంగా ఉందన్నవారు కూడా చాలా మంది ఉన్నారని చెప్పింది. తల్లిదండ్రులను కొన్ని విషయాలు అడిగేందుకు భయపడతామని, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా వీటిపై అవగాహన కలిగిందన్న యూత్ ఉందని వివరించింది. కాగా గత నెల తన యూట్యూబ్ చానల్‌లో తండ్రితో చేసిన ఇంటర్వ్యూను పోస్ట్ చేసిన ఆలియా.. ప్రీమారిటల్ సెక్స్, పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ విషయాలు చెప్పినప్పుడు తండ్రి ఎలా స్పందించాడనే విషయాలపై చర్చించింది.

Advertisement

Next Story