కడుపు నొప్పి భరించలేక… పురుగుల మందు తాగి

by Sridhar Babu |
కడుపు నొప్పి భరించలేక… పురుగుల మందు తాగి
X

దిశ, హుజురాబాద్: కడుపు నొప్పి భరించలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన భాషవేణి అఖిల(19) కడుపు నొప్పి భరించలేక గురువారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఆదివారం ఆస్పత్రిలో మృతి చెందింది.

Advertisement

Next Story