- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రన్నింగ్ బస్సు దిగి.. హుస్సేన్ సాగర్‌లో దూకిన యువకుడు.. కారణం అదేనా ?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ చాలా పవర్ ఫుల్.. ప్రేమించిన వారు దూరం అవుతున్నారు అని తెలిస్తే చాలు ప్రాణం తీసుకోవడానికి సిద్దపడుతారు ప్రేమికులు. ప్రేమ విఫలమైందని ఓ యువకుడు రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నగరంలో ఈరోజు ( శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. కలకత్తాకు చెందిన 23 ఏళ్ల యువకుడు మౌలాలిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు.. విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. దీంతో అతని ప్రేమ విఫలం అయినట్టే అని భావించి ఏకంగా రన్నింగ్ బస్సులో నుంచి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు యువకుడిని గమనించి వెంటనే నీటిలో దూకి అతన్ని పైకి తీసుకువచ్చారు. దీంతో యువకుడు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. స్టేషన్‌కి తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావని అడుగగా, ప్రేమ విఫలం అయ్యిందంటూ సమాధానం ఇచ్చాడు. అనంతరం యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.