పగబట్టిన పక్కింటి మహిళ.. నాలుగు నెలల చిన్నారి నోట్లో..

by Anukaran |   ( Updated:2021-06-27 01:32:53.0  )
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమంటారు. వారిని చూస్తే ముద్దు చేయాలనిపిస్తోంది కానీ ఎవరికి చంపాలనిపించదు. కానీ, మానవత్వం మంటగలిసినప్పుడు, పగా ప్రతీకారాలు మనిషి బుద్దిని రాక్షసంగా మార్చినప్పుడే అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక తల్లికి తన బిడ్డను దూరం చేసింది మరో తల్లి. తానూ ఒక తల్లిని అని మరిచి కర్కశంగా ప్రవర్తించింది. కన్నపేగు భాద ఎలాంటిదో తెలిసి కూడా మరో తల్లికి ఆ బాధను మిగిల్చింది ఓ కిరాతక మహిళ. పిల్లల మధ్య జరిగిన ఒక చిన్న గొడవ పసికందు ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హర్యానా లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో ఉద్యోగనిమిత్తం వచ్చి వినోద్ కుటుంబం స్థిరపడింది. కాగా వినోద్ కుమార్‌కు రాఖీ(8) అనే కూతురుతోపాటు నాలుగు నెలల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండు రోజుల క్రితం రాఖీ పక్కింటి మహిళ కూతురు షాలినితో ఆడుకొంటుండగా వారిద్దరికీ చిన్న గొడవ అయ్యింది. ఈ గొడవలో రాఖీ, షాలిని ని కొట్టింది. దీంతో చిన్న పిల్లల మధ్య గొడవ కాస్తా పెద్దవారి మధ్య గొడవకు దారితీసింది. షాలిని తల్లి, రాఖీ తల్లి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ గొడవతో రాఖీ తల్లిపై షాలిని తల్లి కక్ష పెంచుకొంది.

అదును చూసి ఆమెపై పగ తీర్చుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాఖీ తల్లి నాలుగు నెలల బిడ్డను నిద్రపుచ్చి మంచినీటికోసం బయటికి వెళ్ళింది. ఇది గమనించిన పక్కింటి మహిళ తన ఇంట్లో ఉన్న యాసిడ్ బాటిల్ తో బిడ్డ ఉన్న రూమ్ కి వెళ్లి కర్కశంగా బిడ్డ నోట్లో యాసిడ్ పోసి ఏమితెలియని దానిలా ఇంటికి వెళ్ళిపోయింది. మంచినీళ్ళు తీసుకొని ఇంట్లోకి వచ్చిన వినోద్ భార్య బిడ్డ విగతజీవిగా పడిఉండడం చూసి తల్లడిల్లిపోయింది. పసికందును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు తెలపడంతో తల్లి కుప్పకూలిపోయింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కింటి మహిళను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

Advertisement

Next Story