- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
9 మంది శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మాములుగా కవలలు జన్మిస్తేనే ఒక్కింత ఆశ్చర్యానికి లోనవుతుంటాం. కానీ అదే ఒకేసారి 9 మంది శిశువులకు జన్మనిస్తే షాక్ అవ్వాల్సింది. అదీకూడా గర్భస్త సమయంలో అల్ట్రాసౌండ్ పరీక్షల్లో వైద్యులు ఏడుగురు పిల్లలని నిర్దారించిన తరువాత. అవునండీ.. పశ్చిమాఫ్రికా దేశంలోని మాలిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మాలిలోని హలీమా సిస్సే అనే 25 ఏళ్ల మహిళ వైద్యపరీక్షల కోసం మార్చిలో ఆసుపత్రికి వెళ్లింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలో ఏడుగురు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆమె ప్రసవ సమయంలో స్పెషలిస్ట్ పర్యవేక్షణ అవసరమని మొరాకాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవవేదన మొదలవడంతో వైద్యులు అపరేషన్ చేశారు. ముందు ఏడుగురు శిశువులు అనుకున్న వైద్యులు సైతం తొమ్మది మంది ఉండడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఈ తొమ్మది శిశువుల్లో ఐదుగురు అమ్మాయిలు ఉండగా నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఇలా జన్మించిన శిశువులల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపి పర్యవేక్షిస్తున్నారు.