వానాకాలం రైతు భరోసా ఇవ్వాలి : సంగారెడ్డి ఎమ్మెల్యే

by Aamani |   ( Updated:2024-10-19 12:01:12.0  )
వానాకాలం రైతు భరోసా ఇవ్వాలి :  సంగారెడ్డి ఎమ్మెల్యే
X

దిశ, సంగారెడ్డి : వానాకాలం ముగింపు దశకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇవ్వలేదని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గొప్ప గొప్ప పథకాలు తెస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్‌ నేతలు, అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలేమో గానీ ఉన్న పథకాలను ఎలా ఊడగట్టాలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడమే అవుతుందన్నారు. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అని మంత్రి తుమ్మల చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు ఊరుకోరన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు..అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదన్నారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవడంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed