అయ్యో.. నా భర్త పురుషాంగాన్ని ఆమె కోసుకుపోయింది

by Anukaran |   ( Updated:2021-05-17 06:01:27.0  )
అయ్యో.. నా భర్త పురుషాంగాన్ని ఆమె కోసుకుపోయింది
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. వీటివలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది పిల్లలు అనాధులుగా బతుకుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇక ఈ వివాహేతర సంబంధాలు బయటపడతాయేమోనన్న భయంతో కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళా తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందేమోనని ఓ వ్యక్తి పురుషాంగాన్ని కోసేసిన దారుణ ఘటన బీహార్ లో వెలుగుసిచూసింది. వివరాలలోకి వెళితే.. బీహార్ కు చెందిన పవిత్రి అనే మహిళ గతకొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు పప్పు భగత్ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

వారిద్దరూ నిత్యం పొలాల్లో రహస్య ప్రదేశాల్లో తిరుగుతూ కనిపించేవారు. అనుకోకుండా వీరిద్దరి రాసలీలలను హరేంద్ర మంఝీ అనే వ్యక్తి చూశాడు. దీంతో ఆ వ్యక్తి ఎక్కడ తమ వ్యవహారం బయటపెడతాడేమోనని భయపడిన మహిళ, ఒక్కసారి మాట్లాడాలని చెప్పి హరేంద్ర మంఝీ ని పొలం దగ్గరకు పిలిచింది. అతడితో సరదాగా ఉన్నట్లు నటించి, కత్తితో అతని పురుషాంగాన్ని కోసేసింది. ఈ విషయాన్ని దాచి అతను తనని లైంగికంగా వేధించాడని, అందుకే తానూ ఆ పని చేయాల్సివచ్చిందని కట్టుకథ అల్లింది. ఇక ఈ విషయం తెలుసుకున్న బాధితుడి భార్య మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పురుషాంగాన్ని ఆమె కావాలనే కోసేసిందని హరేంద్ర మంఝీ భార్య ఫిర్యాదులో తెలిపింది. పోలీసుల విచారణలో నిజాలు బయటకురావడంతో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story