శ్రీదేవి వేధిస్తున్నారంటున్న గీతా గుప్తా.. రోడ్డుపై బైఠాయించి నిరసన

by Sampath |
Geetha
X

దిశ, అల్వాల్​ : మల్కాజిగిరి సర్కిల్ టౌన్​ప్లానింగ్ అక్రమ లీలలు అంతా ఇంతా కాదు. పలుకుబడి, రాజకీయ అండదండలు ఉంటే చాలు వారికి వంత పాడుతారు. ఎంత అంటే ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చేయగల సమర్ధులు. తాజాగా కబ్జాదారులకు వంత పాడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గీతా గుప్తా కథనం ప్రకారం.. తన స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి టౌన్​ప్లానింగ్ సెక్షన్​ఆఫీసర్ శ్రీదేవి..​అండగా నిలుస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

అంతే కాకుండా మహిళా అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని తాళ్ల బస్తీకి చెందిన గీతా గుప్తా ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని గత 8 నెలల నుంచి వేడుకుంటున్నా.. శ్రీదేవి మాత్రం కనికరించడంలేదని కబ్జాదారులకే సపోర్టు చేస్తున్నారని గీతా ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. దానిని లెక్క చేయకుండా అధికారి అండతో నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. మహిళా అధికారి తీరును నిరసిస్తూ శనివారం బాధిత మహిళ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.

Advertisement

Next Story