మహిళపై అత్యాచారం… చంపుతానని బెదిరింపు

by Sumithra |   ( Updated:2020-08-25 09:50:27.0  )
మహిళపై అత్యాచారం… చంపుతానని బెదిరింపు
X

దిశ, ఆలేరు: తనపై అత్యాచారం జరిగిందని, ఎలాగైనా తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆలేరు పోలీసు స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నమోదు అయ్యింది. వివరాళ్లోకి వెళితే… రెండ్రోజులు క్రితం పట్టణానికి చెందిన ఓ మహిళా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లింది.

వైద్యం చేయించుకున్న అనంతరం ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉండగా ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి ఇంటి వద్ద దించుతానని ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆమెను యాదగిరిగుట్టకు తీసుకెళ్లి, రెండ్రోజులు అత్యాచారం చేశారని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని బాధిత మహిళ స్థానిక ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story