తెలుగు యువకుడికి అమెజాన్ ఆఫర్

by srinivas |
తెలుగు యువకుడికి అమెజాన్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు యువకుడికి అమెజాన్ బంపరాఫర్ ఇచ్చింది. ఇటీవల అమెజాన్ నిర్వహించిన ఫైనాన్షియల్ లీడర్ షిప్ ప్రోగ్రామ్ లో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా తెలుగు యువకుడు గిర్రెడ్డి వివేక్ ఎంపికయ్యాడు. ఇతను 1.50 కోట్ల వేతనంతో ఈ ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలో సాలీనాలో ఉద్యోగం పొందాడు. ఈ సంస్థలో ఇతనికి బేసిక్ శాలరీతో పాటు, ఇతర ప్రోత్సాహకాలు, అలవెన్సులను కలిపితే, అతనికి ఏడాదికి కోటిన్నర రూపాయల వేతనం లభించనుంది. వివేక్ ముంబైలోని డాన్ బాస్కో స్కూల్ లో ఇంటర్ వరకూ చదివి, ఆపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కెనడాలోని మాంట్రియల్ లో ఉన్న మెక్ గిల్ యూనివర్శిటీలో, ఆపై అట్లాంటాలోని జార్జ్ టెక్ వర్శిటీలో ఎంబీఏ విద్యను అభ్యసించాడు. ఇతనిది తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందినవాడు . కానీ ఇతని తల్లి దండ్రులు సూర్యనారయణ రెడ్డి, బానులు ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed