- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
దిశ, మెదక్: తల్లిదండ్రులతో గొడవపడిన ఓ యువకుడు చనిపోతానంటూ వెళ్లిపోయాడు వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట పట్టణం ముర్షద్ గడ్డకు చెందిన 28 ఏళ్ల ఓ యువకుడు తల్లిదండ్రులతో గొడవ పడి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తన కొడుకు ప్రవర్తన గమనించిన ఆ తల్లిదండ్రులు వెంటనే సిద్ధిపేట టు టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ కు ఫోన్ ద్వారా సమాచారమందించారు. వెంటనే స్పందించిన సీఐ యువకుడి ఫోన్ నెంబర్ ను ఐటీ కోర్ కానిస్టేబుల్ శశికాంత్ కు ప్రస్తుత లోకేషన్ గుర్తించి పంపించగా వెంటనే శశికాంత్ సంబంధిత ప్రొవైడర్లతో మాట్లాడి యువకుడి లొకేషన్ పుల్లూరు గ్రామ శివారులో ఉందని తెలిపాడు. దీంతో సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ సందీప్ రెడ్డి, హోంగార్డ్ మల్లేశం రాత్రి 9 గంటలకు పుల్లూరు గ్రామ శివారులో అతనిని వెతికి పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకుని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఫోన్ చేయగానే స్పందించి తన కొడుకు ప్రాణాలు కాపాడిన పోలీసులకు అభినందనలు తెలిపారు.