- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య పోషణకు సెక్స్ వర్కర్ గా మారిన భర్త.. భార్య ఏం చేసిందంటే?
దిశ, వెబ్ డెస్క్: కరోనా .. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది.. ఎన్నో కుటుంబాలను రోడ్డు మీదకు లాగింది… మరెంతోమందిని మనకు కాకుండా చేసింది. ఈ మహమ్మారి వలన ఉద్యోగాలను పోగొట్టుకొని .. రోడ్డు మీద దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నారు కొందరు ఉద్యోగులు. మరి కొంతమంది కుటుంబాన్ని పోషించలేక .. తమ దారి తాము చూసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కుటుంబాన్ని నిలబెట్టడానికి సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి వలన ఉద్యోగాన్ని పోగొట్టుకొని సెక్స్ వర్కర్ గా మారాడు ఒక యువకుడు. ఈ దారుణమైన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.
బెంగుళూరులో బీపీఓ కంపెనీలో ఉద్యోగ చేస్తున్న ఒక యువకుడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. భార్యతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో కరోనా వలన ఉద్యోగం పోయింది. దీంతో కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్న యువకుడు డబ్బు కోసం ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో త్వరగా డబ్బు సంపాదించడానికి అతను సెక్స్ వర్కర్ గా మారాడు. కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారి గంటకు రూ.3000 నుంచి రూ.5000 వరకూ సంపాదించేవాడు.
అయితే కొద్దీ రోజులు బాగానే నడిచిన ఈ వ్యవహారం భార్యకు తెలియడంతో గుట్టు రట్టు అయ్యింది. కొన్ని రోజుల నుండి భర్త ల్యాప్ టాప్, ఫోన్లతోనే గడుపుతుండడం చూసిన భార్యకు అనుమానమొచ్చింది. తనకు తెలిసిన ఫ్రెండ్ తో భర్త ల్యాప్ టాప్ ఓపెన్ చేయించింది. అందులో భర్త నగ్న వీడియోలు, వేరే యువతుల అర్ద నగ్న వీడియోలు చూసి షాక్ అయ్యింది. ఏంటి ఇది అని భర్తను నిలదీయగా అతడు అందంతా గ్రాఫిక్స్ అని నచ్చజెప్పడానికి ట్రై చేసాడు. కానీ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అసలు నిజం బయటపెట్టాడు. దీంతో భార్య అతడితో విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది.