మద్యం సేవించి పాఠశాలలో హల్‌చల్.. ఉపాధ్యాయుడిని గెంటేసిన సర్పంచ్

by Shyam |
Chiruthapally GPS
X

దిశ‌, వెంక‌టాపురం: విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. రోజూ పాఠశాలకు మద్యం సేవించి వస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిరుతపల్లి గ్రామంలోని జీపీఎస్ పాఠశాలలో సున్నం కామరాజు వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూ పాఠశాలకు మద్యం సేవించి వస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సదరు ఉపాధ్యాయున్ని పాఠశాల నుంచి బయటకు గెంటేశాడు. అనంతరం ఒక్కరోజు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థలకు సర్పంచ్ పాఠాలు బోధించాడు.

అనంతరం సర్పంచ్ కొర్శ నరసింహమూర్తి మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా ఉపాధ్యాయుడు కామరాజు ప్రవర్తణలో మార్పు కనిపిస్తోందని, విధి నిర్వాహణలో నిర్లక్ష్యం చేస్తున్నాడని అన్నారు. పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తణలో మార్పు రాలేదని, అందుకే స్కూళ్లోంచి గెంటేశామని తెలిపారు. ఏజెన్సీలో విధులు నిర్వహిస్తూ.. గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించాల్సింది పోయి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. కామరాజుపై చర్యలు తీసుకోవాలని, మరొక ఉపాధ్యాయున్ని నియమించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed